3 నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2020-12-02T04:32:00+05:30 IST

సింహపురి ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 3 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ పీవీరావు తెలిపారు.

3 నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌

గూడూరు, డిసెంబరు 1: సింహపురి ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 3 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ పీవీరావు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా 10 నెలల నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయిందన్నారు. ఈనెల 3న సికింద్రాబాద్‌ నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుందని, 4వ తేదీ నుంచి గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.


Updated Date - 2020-12-02T04:32:00+05:30 IST