వలంటీర్‌పై ఎక్సైజ్‌ సీఐ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-28T06:24:29+05:30 IST

కూరగాయల మార్కెట్‌లోకి తన కొడుకు బైక్‌ ప్రవేశాన్ని అడ్డుకున్న వలంటీర్‌ను ఎక్సైజ్‌ సీఐ దుర్భాషలాడి

వలంటీర్‌పై  ఎక్సైజ్‌ సీఐ ఆగ్రహం

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి27: కూరగాయల మార్కెట్‌లోకి తన కొడుకు బైక్‌ ప్రవేశాన్ని అడ్డుకున్న వలంటీర్‌ను ఎక్సైజ్‌ సీఐ దుర్భాషలాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో శుక్రవారం జరిగింది. కరోనా వైర్‌సను అరికట్టేందుకు ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌తో పట్టణంలోని కూరగాయల మర్కెట్‌లోకి కొనుగోలుదారులు తప్ప బైక్‌లు, ఆటోలు, ఇతర వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు.


ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బుచ్చి ఎక్సైజ్‌ సీఐ  ప్రసన్నలక్ష్మి కుమారుడు ఓ బాలుడితో బైక్‌పై వచ్చి మార్కెట్‌లోకి వెళ్తుండగా విధుల్లో 4వ సచివాలయ పరిధిలోని దివ్యాంగ వలంటీర్‌ నిజాముద్దీన్‌ అడ్డుకున్నాడు. దీంతో సీఐ కుమారుడు వలంటీర్‌ను దూషించాడు. అనంతరం ఇంటికెళ్లి అడ్డుకున్న విషయాన్ని తల్లికి చెప్పాడు. 


కొడుకును వెంటబెట్టుకొని మార్కెట్‌కు వచ్చిన ఆమె మీ ఒక్కరితోనే తెల్లారుతుందా అంటూ వలంటీర్‌ను అసభ్యపదజాలంతో దూషించింది. ఈ విషయాన్ని నగర ప్రత్యేకాధికారికి పలువురు సమాచారం  అందించారు. ఫొటోలు, వీడియోలు ఆధారాలుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినట్లు సమాచారం. వలంటీర్‌ను సీఐ దూషించిన వీడియో వాట్సా్‌పలలో హల్‌ చల్‌ చేశాయి. 

Updated Date - 2020-03-28T06:24:29+05:30 IST