ప్రశాంతంగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-12-06T04:11:12+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌, టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) కళాశాల ట్రిపుల్‌ ఐటీ ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష
పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)డిసెంబరు 5:  రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌, టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) కళాశాల ట్రిపుల్‌ ఐటీ ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన  పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 35 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు హాజరయ్యారు. 4274 మందికిగాను 4132 మంది విద్యార్థులు హాజరయ్యారు. 142 మంది గైర్హాజరయ్యారు. నెల్లూరులోని దర్గామిట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షను జేసి ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట డీఈవో  రమేష్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-06T04:11:12+05:30 IST