ఎత్తిపోతల పథకానికి రూ.1,87 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2020-11-16T04:59:50+05:30 IST

ఎత్తిపోతల పథకానికి రూ.1,87 కోట్లు మంజూరు చేయడం జరిగిందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకానికి రూ.1,87 కోట్లు మంజూరు

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి 

వెంకటాచలం, నవంబరు 15 : ఎత్తిపోతల పథకానికి రూ.1,87 కోట్లు మంజూరు చేయడం జరిగిందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సర్వేపల్లిలో శనివారం ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ధకాలంగా సర్వేపల్లి రిజర్వాయర్‌ మరమ్మతులకు నోచుకోక రైతులు ఇబ్బంది పడుతుండడంతో  ఈ విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ఆయన స్పందించి రిజర్వాయర్‌ పనులకు రూ.11,34 కోట్లు మంజూరు చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం నియోజక వర్గంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లాలో రెండో పంటకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వంలో 3 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు కనుపూరు కోదండరామిరెడ్డి, కట్టంరెడ్డి విజయమోహన్‌రెడ్డి, వేమారెడ్డి రఘనందన్‌రెడ్డి, మందల వెంకటశేషయ్య, ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, కట్టంరెడ్డి విజయకుమార్‌రెడ్డి, తాళ్లపాక చంద్రశేఖర్‌రెడ్డి, చాట్ల వెంకటసుబ్బయ్య, డక్కిలి రమణయ్య, డేగా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-16T04:59:50+05:30 IST