రేపటి నుంచి నిత్యావసర దుకాణాలు బంద్‌

ABN , First Publish Date - 2020-04-07T10:47:47+05:30 IST

నెల్లూరులో అన్ని రకాల నిత్యావసర సరుకుల దుకాణాలను ఈ నెల 8 నుంచి మూసివేస్తున్నట్లు చాంబర్‌ ఆఫ్‌

రేపటి నుంచి  నిత్యావసర దుకాణాలు బంద్‌

బయట ప్రాంతాల నుంచి సరుకు రాకనే నిర్ణయం

తనిఖీలు పేరుతో బెదిరింపులు

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ ప్రకటన


నెల్లూరు (సాంస్కృతికం), ఏప్రిల్‌ 6 :  నెల్లూరులో అన్ని రకాల నిత్యావసర సరుకుల దుకాణాలను ఈ నెల 8 నుంచి మూసివేస్తున్నట్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌  గౌరవా ధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన చాంబర్‌ కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడారు. మాట్లాడారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వ్యాపారులకు వివిధ ప్రాంతాల నుంచి సరుకులు సక్రమంగా రావడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన సమయంలో కరోనా  గురించి భయపడకుండా ప్రజలకు నిత్యావసరుకులు అందచేస్తున్నామని, కానీ అధికారులు తనిఖీల పేరుతో వ్యాపారులను బెదిరిస్తూ కేసులు రాస్తూ ఇబ్బంది పెడుతున్నారు. దుకాణాల వద్ద కొనుగోలుదారులను సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.


జనం గుంపులు గుంపులుగా వచ్చి సరుకులు కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో సరుకులు సరఫరాలో ఒడిదుడుకులు ఉంటాయని, వాటిని గుర్తించకుండా అధికారులు దాడులు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.  వ్యాపారులు ఉండే  పరిసర ప్రాంతాల్లో కరోనా  బాధితులు బయటపడడంతో  దుకాణాలు మూసి వేసి ఇంటిలోనే ఉండాలని వారివారి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని చాంబర్‌ అధ్యక్షుడు దాసా లక్ష్మీనారాయణ తెలిపారు. అధికారులు బజారు ప్రాంతాల్లో భౌతిక దూరంపై చర్యలు తీసుకోవాలని కోరారు.


అధికారుల తనిఖీలకు నిరసనగా దుకాణాలను బుధవారం నుంచి మూసి వేయాలని నిర్ణయించుకున్నామని  ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వ్యాపార సంఘాల నాయకులు మంచికంటి శ్రీనివాసులు, శ్రీరామ్‌ సురేష్‌, పెంచల నరసింహస్వామి, వెలుగొండయ్య, గుండ్లపల్లి సునీల్‌, పెసల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-04-07T10:47:47+05:30 IST