10 ఎర్రచందనం దుంగల స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-31T04:09:38+05:30 IST

మండలంలోని నాగాయగుంట కేంద్రంగా ఎర్ర చందనం అక్రమ రవాణా సాగించే ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

10 ఎర్రచందనం దుంగల స్వాధీనం

 నిందితుడి అరెస్టు

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు30: మండలంలోని నాగాయగుంట కేంద్రంగా ఎర్ర చందనం అక్రమ రవాణా సాగించే ఓ ఇంటిపై  పోలీసులు దాడి చేశారు. నిందితుడు పాలూరి మాలకొండలరావును పట్టుకుని, 10  ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి  తెలిపారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన  తెలిపారు.  


Updated Date - 2020-12-31T04:09:38+05:30 IST