ఆక్రమిత చెన్నకేశవుడి భూముల స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-20T04:58:22+05:30 IST

అల్లీపురం దళితవాడకు చెందిన చెన్నకేశవ స్వామి ఆలయ ఆక్రమిత భూముల్లో శనివారం దళితులు దుక్కి దున్ని వాటిని ఆలయానికి చెందేలా స్వాధీనం చేసుకున్నారు.

ఆక్రమిత చెన్నకేశవుడి భూముల స్వాధీనం
స్వాధీనం చేసుకున్న భూముల్లో అల్లీపురం దళితులు

నెల్లూరురూరల్‌, డిసెంబరు 19 : అల్లీపురం దళితవాడకు చెందిన చెన్నకేశవ స్వామి ఆలయ ఆక్రమిత భూముల్లో శనివారం దళితులు దుక్కి దున్ని వాటిని ఆలయానికి చెందేలా స్వాధీనం చేసుకున్నారు. అల్లీపురం ప్రాంతానికి చెందిన కొందరు భూస్వాములు సర్వే నెం. 72లోని 1.07 ఎకరాలను ప్రభుత్వ ఆస్తి నెపంతో స్వాధీనం చేసుకుని అన్యాక్రాంతం చేసే కుట్ర జరుగుతుందని దళితులు ఆరోపించారు. తమ ప్రాంత చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన ఆస్తిని తామే కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. ట్రాక్టర్లతో దుక్కిదుని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా తమ ఆలయ భూమి జోలికొస్తే ఊరుకునేది లేదని వారంతా హెచ్చరించారు.

Read more