-
-
Home » Andhra Pradesh » Nellore » electricity
-
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
ABN , First Publish Date - 2020-11-27T05:46:36+05:30 IST
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు డిమాండ్ చేశారు.

నెల్లూరు(జడ్పీ), నవంబరు 26 : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు డిమాండ్ చేశారు. గురువారం మిలీనియం సబ్‌ష్టేషన్ ఎదుట యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే 2020 విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారని, దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, ఆరీఫ్, రాజా తదితరులు పాల్గొన్నారు.