ఐఆర్‌డీఏ ద్వారానే విద్యుత్‌ బిల్లింగ్‌!

ABN , First Publish Date - 2020-11-20T02:30:17+05:30 IST

విద్యుత్‌ సర్వీసుల బిల్లింగ్‌ తప్పనిసరిగా ఐఆర్‌డీఏ ద్వారానే జరగాలని, మాన్యువల్‌ రీడింగ్‌ తీయవద్దని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి సూచించారు.

ఐఆర్‌డీఏ ద్వారానే విద్యుత్‌ బిల్లింగ్‌!
సమావేశంలో మాట్లాడుతున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి 

నాయుడుపేట టౌన్‌, నవంబరు 19 : విద్యుత్‌ సర్వీసుల బిల్లింగ్‌ తప్పనిసరిగా ఐఆర్‌డీఏ ద్వారానే జరగాలని,  మాన్యువల్‌ రీడింగ్‌ తీయవద్దని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి సూచించారు. నాయుడుపేట విద్యుత్‌శాఖ డివిజన్‌ కార్యాలయంలో గురువారం ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిర్దేశిత సిబ్బంది చెక్‌రీడింగ్స్‌ తీసి ట్యాబ్‌లో ఎంటర్‌చేయాలని, కాలిపోయిన లేదా ఆగిపోయిన మీటర్లను తక్షణమే మార్చాలని తెలిపారు. శనివారం రోజున మీటర్లు మార్చే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ నగదు బదిలీ పథకానికి వినియోగదారుల నుంచి ఆధార్‌, బ్యాంక్‌ పాసుపుస్తకాలను త్వరితగతిన సేకరించి సంబంధిత ఏఈలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌పై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. డివిజన్‌లో లోవోల్టేజ్‌ సమస్యపై వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని వినియోగదారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కృష్ణప్రసాద్‌, డీఈలు ప్రసన్నకుమార్‌, ముని, రవిచంద్ర, ఖాదర్‌బాషా, అకౌంట్స్‌ అధికారి కృష్ణారావు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T02:30:17+05:30 IST