కాటేసిన కరెంటు
ABN , First Publish Date - 2020-12-12T04:41:09+05:30 IST
పొలంలో క్రిమిసంహారక మందులు చల్లుతుండగా విద్యుదాఘాతం సోకడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఒకరి మృతి
మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన
తహసీల్దారు, ఎస్‌ఐ జోక్యంతో విరమణ
చిట్టమూరు, డిసెంబరు 11: పొలంలో క్రిమిసంహారక మందులు చల్లుతుండగా విద్యుదాఘాతం సోకడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మల్లాం గ్రామానికి చెందిన మేర్లపాక భాస్కర్ (45) శుక్రవారం మరో ఇద్దరు కూలీలతో కలిసి వరి పైరుకు మం దు పిచికారీ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇటీవలి తుఫాను కారణంగా మల్లాం గ్రామ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయి, తీగలు తెగిపోయాయి. వాటిని సరిచేయకుం డానే విద్యుత్ సరఫరా చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్న ఆగ్రహంతో మృతుడి బంఽధువులు, గ్రామస్థులు మృతదేహాన్ని మల్లాం సబ్‌స్టేషన్ వద్ద ఉంచి ఆందోళన చేశారు. సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తహసీల్దారు రవికుమార్, ఎస్‌ఐ కిషోర్‌బాబు సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని శాంతింపచేశారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.