తప్పులులేని జాబితాను సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2020-12-14T04:07:53+05:30 IST

వందశాతం తప్పులు లేని ఓటరు జాబితా ను సిద్ధం చేయాలని రోల్‌ పరిశీలకులు కే ఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్ర వర్తి సూచించారు.

తప్పులులేని  జాబితాను సిద్ధం చేయండి
మాట్లాడుతున్న రోల్‌ పరిశీలకుడు చక్రవర్తి

రోల్‌ పరిశీలకులు కెఆర్‌బిహెచ్‌ఎన్‌ చక్రవర్తి 

నాయుడుపేట, డిసెంబరు 13 : వందశాతం తప్పులు లేని ఓటరు జాబితా ను సిద్ధం చేయాలని రోల్‌ పరిశీలకులు కే ఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్ర వర్తి సూచించారు. నా యుడుపేట ఆర్డీవో కా ర్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సంబంధిత అధికారులు బీఎల్‌వోలకు ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని పరిశీలించి ఏమైన తేడాలు ఉంటే సరిచేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో వయస్సు వారిగా ఎంత మంది ఓటర్లు ఉన్నారన్న అంశం గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్‌ అధికారి కృష్ణారావు, నాయుడుపేట ఆర్డీవో సరోజిని, 6 మండలాల తహసీల్దారులు నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-14T04:07:53+05:30 IST