కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జెండా పండుగ
ABN , First Publish Date - 2020-08-11T10:27:26+05:30 IST
నెల్లూరులోని పోలీసు పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని డీఆర్వో మల్లికార్జున చెప్పారు.

డీఆర్వో మల్లికార్జున
నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 10 : నెల్లూరులోని పోలీసు పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని డీఆర్వో మల్లికార్జున చెప్పారు. జెండా పండుగపై ఆయన చాంబర్లో సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య వేడుకలు జరుగుతాయన్నారు. మండల, డివిజన్ స్థాయిలో అధికారులు వారి కార్యాలయాల్లో ఉదయం 9 గంటల్లోపు వేడుకలను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచించారు. పోలీసు పరేడ్ మైదానానికి ఉదయం 8.30 గంటలకే హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లపైడిన వృద్ధులు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారన్నారు.