తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-05-13T10:32:02+05:30 IST

గ్రామాల్లో వేసవిలో తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సర్వేపల్లి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్‌

తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

అధికారులతో ఎమ్మెల్యే కాకాణి


 మనుబోలు, మే 12: గ్రామాల్లో వేసవిలో తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సర్వేపల్లి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.  మీ గ్రామంలో దోమలు, దిబ్బలు ఉంటే నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని సమీక్షించారు. ఆర్థిక సంఘం నిధులు ఎంత ఖర్చు చేశారంటూ తెలుసుకున్నారు. వీధిదీపాలు, కరెంటు, పారిశుధ్యం వసతులను కూడా తప్పనిసరిగా కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆనందరావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read more