మత్తుపదార్థాల వినియోగంతో జీవితాలు విచ్ఛిన్నం

ABN , First Publish Date - 2020-12-20T03:18:46+05:30 IST

మత్తుపదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తాయని డీఎస్పీ ప్రసాద్‌ పేర్కొన్నారు.

మత్తుపదార్థాల వినియోగంతో జీవితాలు విచ్ఛిన్నం
డీఎస్పీ, సీఐ, ఎస్సైలను సత్కరిస్తున్న నిర్వాహకులు

కావలి డీఎస్పీ ప్రసాద్‌

కావలిటౌన్‌, డిసెంబరు 19: మత్తుపదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తాయని డీఎస్పీ ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం శ్రీసాయి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో మత్తుపదార్థాల నిషేధంపై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీసాయి విద్యాసంస్థల చైర్మన్‌ అయ్యలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. అనంతరం కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విజయవంతంగా విధులు నిర్వహించిన కరోనా వారియర్స్‌ను అయ్యలరెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Read more