నాటకాలకు ఆదరణ తగ్గింది

ABN , First Publish Date - 2020-09-14T10:22:31+05:30 IST

సమకాలీన సమస్యల ఇతివృత్తంతో నాటకాలు ఎక్కువగా రాకపోవడం, నాటక స్థానాన్ని టీవీ సీరియల్స్‌, సినిమాలు ..

నాటకాలకు ఆదరణ తగ్గింది

డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), సెప్టెంబరు 13 : సమకాలీన సమస్యల ఇతివృత్తంతో నాటకాలు ఎక్కువగా రాకపోవడం, నాటక స్థానాన్ని టీవీ సీరియల్స్‌, సినిమాలు ఆక్రమించడంతో నాటకాలకు ఆదరణ తగ్గిందని మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి పేర్కొన్నారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల వారు  జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్న సాహితీ కౌసల్యం కార్యక్రమంలో ఆదివారం తెలుగు నాటకం - సాహిత్య విమర్శ అంశంపై లక్ష్మణ చక్రవర్తి ప్రసంగించారు. నాటకాలకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదని, అది తగ్గడానికి కల అన్ని కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తెలుగు నాటక సాహిత్య విమర్శ ఏ రకంగా ఎదిగిందో వివరిస్తూ అనేక గ్రంథాలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ మస్తానయ్య, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్‌ కరుణశ్రీ, డాక్టర్‌ దివిజాదేవి, డాక్టర్‌ పద్మ ప్రియ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-14T10:22:31+05:30 IST