ప్రజా భాగస్వామ్యంతో మనం- మన పరిశుభ్రత: డీపీవో
ABN , First Publish Date - 2020-12-14T04:35:59+05:30 IST
జిల్లాలో చేపట్టిన మనం - మన పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని డీపీవో ధనలక్ష్మి పేర్కొన్నారు.

సంగం, డిసెంబరు 13: జిల్లాలో చేపట్టిన మనం - మన పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని డీపీవో ధనలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ఆమె సంగం మండలం తరుణవాయి సచివాలయ పరిధిలోని ఉడ్‌హౌస్‌పేటలో మనం - మన పరిశుభ్రత వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. జిల్లాలో తొలుత ప్రతి మండలంలో రెండు పంచాయతీలను మనం - పరిశుభ్రత కార్యక్రమానికి ఎంపిక చేసి ప్రజలను చైతన్యం చేసి పథకం విజయవంతం చేయడం జరిగిందన్నారు. రెండో విడతగా మరో 96 గ్రామాలను ఎంపిక చేసి ప్రజలను భాగస్వామ్యం చేసే అవగాహన కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి నెలకు రూ.60 చెల్లించి పథకంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులైన కొడవలూరు ఎంపీడీవో భూపతి చిరంజీవి, సంగం ఈవోఆర్డీ అప్పాజీ, కార్యదర్శి పద్మమంజుల, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.