-
-
Home » Andhra Pradesh » Nellore » Dont neglect tuberculosis
-
క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వద్దు..
ABN , First Publish Date - 2020-03-24T07:21:08+05:30 IST
ఒకప్పుడు క్షయ వ్యాధి (టీబీ) అంటే భయపడే పరిస్థితి. వ్యాధిగ్రస్థులను నివాసాలకు దూరంగా ఉంచేవారు.

అందుబాటులో ఆధునిక వైద్యం
వ్యాధి నివారణకు ప్రభుత్వ ప్రోత్సాహం
నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం
నెల్లూరు (వైద్యం), మార్చి 23 : ఒకప్పుడు క్షయ వ్యాధి (టీబీ) అంటే భయపడే పరిస్థితి. వ్యాధిగ్రస్థులను నివాసాలకు దూరంగా ఉంచేవారు. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించే వీలుంది. జిల్లాలో ఇప్పటికే 15వేల మంది వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ఏటా క్షయ వ్యాధి వల్ల జిల్లాలో 50 మంది పైగా మరణిస్తున్నారని వైద్యశాఖ చెబుతున్నా, వీరి సంఖ్య 100 మందికి పైగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో టీబీపై స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. మార్చి 24న (నేడు) ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది.
అవగాహన అవసరం
2011లో బహుళ ఔషధ చికిత్స (ఎండీఆర్) కింద వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో నిధులు ఖర్చు చేస్తున్నది. దశల వారీగా విలువైన మందులు అందిస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో ప్రజల్లో మాత్రం ఆవగాహన లేదు. అవగాహన కల్పించడంలో వైద్యశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది.
ఉచిత వైద్య సేవలు
క్షయ వ్యాధి తీవ్రత ఎండీఆర్ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్) గుర్తించేందుకు డామియల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు భక్తవత్సలనగర్‌లో ఆధునాతన పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధి తీవ్రతను బట్టి రెండు లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందచేస్తారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాధి స్థాయిని త్వరగా నిర్ధారించే అత్యాధునిక సీబీనాట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకుచ్చారు.
ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా క్షయ నివారణకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధిగ్రస్థులకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి.
- డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి
అందుబాటులో ఆధునిక వైద్యం
క్షయ నివారణకు నేడు ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. వ్యాధి తీవ్రతను గుర్తించి చికిత్సలు అందిస్తున్నాం. పభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాధిగ్రస్థులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం.
- డాక్టర్ పోకల రవి, పర్మనాలజిస్టు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి