దీర్ఘకాలిక వ్యాధులపై సర్వే చేపట్టండి

ABN , First Publish Date - 2020-12-12T04:32:19+05:30 IST

జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆదేశించారు.

దీర్ఘకాలిక వ్యాధులపై సర్వే చేపట్టండి
వైద్యాధికారుల సమీక్షలో డాక్టర్‌ రాజ్యలక్ష్మి

కరోనా కేసుల వివరాలు నమోదు చేయాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 11 : జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. కుష్ఠు, క్షయ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి పూర్తిస్థాయి సర్వే చేపట్టి ఆయా వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. అలాగే కరోనా వ్యాధిగ్రస్తుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వివరాలు సేకరించాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఆయా నివాసాలను సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ఉమామహేశ్వరి, అమరేంద్ర నాథ్‌రెడ్డి, ఖాధర్‌బాషా, అబ్దుల్‌ మొయిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:32:19+05:30 IST