నిరుపేదలను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-11-14T03:12:54+05:30 IST

నిరాశ్రయులు, నిరుపేదలను అన్ని విధాలా ఆదుకుంటామని టీడీపీ మైనారిటీ సెల్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు, గ్రీన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జలీల్‌ అహ్మద్‌ తెలిపారు.

నిరుపేదలను ఆదుకుంటాం
పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న జలీల్‌ అహ్మద్‌

కోట, నవంబరు 13 : నిరాశ్రయులు, నిరుపేదలను అన్ని విధాలా ఆదుకుంటామని టీడీపీ మైనారిటీ సెల్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు, గ్రీన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జలీల్‌ అహ్మద్‌ తెలిపారు. స్థానిక రవినగర్‌లోని ఎస్‌కేబీ గ్రూప్స్‌ ప్రాంగణంలో శుక్రవారం కోటమ్మ గుడి కాలనీకి చెందిన 120 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 1000 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నాయకులు నౌషాద్‌, షంషుద్దీన్‌, నాయబ్‌, మస్తాన్‌బాబు, అన్వర్‌, జమీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T03:12:54+05:30 IST