ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి : డీఐజీ

ABN , First Publish Date - 2020-11-26T02:52:26+05:30 IST

ప్రజలకు పోలీసుల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని గుంటూరు రేంజ్‌ డీఐజీ

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి : డీఐజీ
పోలీసు స్టేషన్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, చిత్రంలో ఎమ్మెల్యే కాకాణి

టీపీగూడూరు, నవంబరు 25 : ప్రజలకు పోలీసుల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌ వర్మ పేర్కొన్నారు. సెంబ్‌ కార్ప్‌ థర్మల్‌ విద్యుత్‌ సంస్ధ సహకారంతో నిర్మించిన తోటపల్లిగూడూరు పోలీసు స్టేషన్‌ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక వసతులతో కూడిన పోలీసు స్టేషన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు తమ సేవల ద్వారా దగ్గరయ్యేందుకు పోలీసు శాఖ ప్రయత్నిస్తోందన్నారు. మండల కేంద్రంలో అన్ని వసతులతో కూడిన పోలీసు స్టేషన్‌ నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఇలాంటి మోడల్‌ పోలీసు స్టేషన్‌ అవసరం ఉందన్నారు. అనంతరం ఆయన పోలీసు స్టేషన్‌ భవనాన్ని పరిశీలించారు. అవసరాలకు తగినట్టు అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో  ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, అడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ కోటారెడ్డి, రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సెంబ్‌ కార్ప్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం బిజినెస్‌ హెడ్‌ రాఘవ్‌ త్రివేది, యూనిట్‌ హెడ్‌ రమేష్‌ రామన్‌, పోర్టు సీఐ ఖాజావలి, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తదిరులున్నారు.


Updated Date - 2020-11-26T02:52:26+05:30 IST