నెల్లూరుకు వెరుబొట్లపల్లి బాధితులు
ABN , First Publish Date - 2020-12-14T04:04:05+05:30 IST
కలువాయి మండలం వెరుబొట్లపల్లి ఘటనకు సంబంధించి మరో 37 మంది పశ్చిమ బెంగాల్ వ్యవసాయ కూలీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి నెల్లూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.

కలువాయి, డిసెంబరు 13: కలువాయి మండలం వెరుబొట్లపల్లి ఘటనకు సంబంధించి మరో 37 మంది పశ్చిమ బెంగాల్ వ్యవసాయ కూలీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి నెల్లూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురై ఒకరు మృతిచెందగా ఆరుగురు నెల్లూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన కూలీలను కలువాయి బీసీ హాస్టల్‌కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అందరినీ 108 వాహనాల్లో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. వీరికి అత్యవసర చికిత్స అవసరమైతే ఇబ్బంది లేకుండా ఉండేందుకు తరలించినట్లు మండల అధికాలులు తెలిపారు.
శాంపిల్స్ సేకరణ
ఈ ఘటనకు సంబంధించి వలసకూలీలు వినియోగించిన ఆహార పదార్థాలను ఆదివారం ఫుడ్ ఇన్‌స్పెక్టరు చంద్రశేఖర్ పరిశీలించి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నట్లు వివరించారు.
ఇంటింటి సర్వే
ఈ ఘటన నేపథ్యంలో వెరుబొట్లపల్లి, కనుపూరుపల్లి, పెద్దగోవరం గ్రామాల్లో ఆదివారం వైద్యాధికారుల బృందం ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించి సర్వే చేశారు. మందులు అందించారు.