రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-11-14T02:39:15+05:30 IST

ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం, రైతు సంఘం నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 13: ప్రభుత్వం  రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకమరాజు మాట్లాడుతూ రెండు నెలలు గడుస్తున్నా రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల ధాన్యం బకాయిలను చెల్లించాలని లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు ముత్యాల గుర్నాథం, గండవరపు శ్రీనివాసులు, సీహెచ్‌. మల్లికార్జున, జానీభాష, సురేష్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T02:39:15+05:30 IST