నిబంధనలు పక్కాగా అమలు జరపాలి

ABN , First Publish Date - 2020-02-08T06:46:33+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో నిబంధనలు పక్కాగా అమలు జరపాలని నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌

నిబంధనలు పక్కాగా అమలు జరపాలి

ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు సమయపాలన పాటించాలి

నేర సమీక్షలో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ 

నెల్లూరు (క్రైం), ఫిబ్రవరి 7 : ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో నిబంధనలు పక్కాగా అమలు జరపాలని నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వీ రాధయ్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలు సమయ పాలన, మూడు బాటిళ్లు, ఎమ్మార్పీ పక్కాగా పాటించేలా చూడాలన్నారు. దుకాణాల్లో లూజు విక్రయాలు, బహిరంగ మద్యం సేవనం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల్లోని సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ అక్రమాలకు పాల్పడకుండా చూడడంతో పాటు విక్రయ, స్టాక్‌ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ఏ రోజు చలానాలు ఆ రోజే జమ చేసేలా చూడాలన్నారు. బార్లలో కల్తీ విక్రయాలు, రాత్రి విక్రయాలు కట్టడి చేయాలన్నారు. బార్లను విధిగా తనిఖీ చేసి అక్రమాలు గుర్తించి కేసులు నమెదు చేయాలన్నారు. బెల్టు దుకాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ రాదన్నారు. మొబైల్‌ బెల్టు దుకాణాలపై దాడులు చేసి నిందితులపై కేసులు నమోదు చేయాలని, మద్యం ఏ దుకాణం నుంచి వచ్చిందో కనుక్కొని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మద్యం కేసుల్లోని నిందితులందరినీ బైండోవర్‌ చేయాలన్నారు. ఎన్‌బీడబ్ల్యూలను ఎగ్జిక్యూషన్‌ చేయాలని, కేసుల్లో త్వరితగతిన చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని, పెండెన్సీని తగ్గించాలని కోరారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏసీ మూర్తి, నెల్లూరు, గూడూరు ఈఎన్‌లు శ్రీనివాసాచారి, వెంకటరమణారెడ్డి, ఏఈఎన్‌లు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T06:46:33+05:30 IST