దంత వైద్యులకూ రూ.70వేలివ్వాలి

ABN , First Publish Date - 2020-12-14T04:39:58+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు దంత వైద్యులకు రూ.70వేలు వేతనం చెల్లించాలని ఆ వైద్యులు డిమాండ్‌ చేశారు.

దంత వైద్యులకూ రూ.70వేలివ్వాలి
ఆందోళనలో మీడియాతో మాట్లాడుతున్న వైద్యులు

జీజీహెచ్‌ వద్ద ఆందోళన


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 13 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు దంత వైద్యులకు రూ.70వేలు వేతనం చెల్లించాలని ఆ వైద్యులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జీజీహెచ్‌ వద్ద బీడీఎస్‌ వైద్యులు ఆందోళన చేపట్టారు. కరోనా రోగులకు అంకితభావంతో  వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఎంబీబీఎస్‌ వైద్యులకు ప్రభుత్వం రూ.70వేలు వేతనం చెల్లిస్తుంటే బీడీఎస్‌ వైద్యులకు మాత్రం రూ.50 వేలే ఇవ్వటం సరికాదన్నారు. కరోనా సమయంలో జీజీహెచ్‌లో 170 మంది వైద్యులను నియమించగా వారిలో 130 మందికి రూ.50 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఐదు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్‌ వైద్యులు హైదరాలీ, మహేష్‌, శ్రీకాంత్‌, బిందు, హారిక, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-14T04:39:58+05:30 IST