డెంగ్యూ కేసుపై వైద్యఆరోగ్యశాఖ ఏడీ పరిశీలన
ABN , First Publish Date - 2020-11-14T02:52:26+05:30 IST
అన్నారెడ్డిపాళెంలో ఇటీవల భీమతాటి సునంద అనే మహిళకు డెంగ్యూ రావడంతో గ్రామాన్ని శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్ట
సంగం, నవంబరు 13: అన్నారెడ్డిపాళెంలో ఇటీవల భీమతాటి సునంద అనే మహిళకు డెంగ్యూ రావడంతో గ్రామాన్ని శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కోడూరు ఉమామహేశ్వర గాంధీ సందర్శించారు. పారిశుధ్యాన్ని పరిశీలించి ఇంటింటా లార్వా సర్వేపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. స్థానిక వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యాధికారి ప్రతిమ, సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్‌బాషా, ఎంపీ హెచ్‌ఈవో మంగారావు, వైద్య సిబ్బంది ఉన్నారు.