డిగ్రీ అడ్మిషన్ల వివరాల్ని 7లోగా అప్‌లోడ్ చేయండి
ABN , First Publish Date - 2020-10-03T20:55:47+05:30 IST
డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల వివరాలను విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) పరిధిలోని కళాశాలలు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఈనెల 7వ తేదీలోగా అప్‌లోడ్
వీఎస్‌యూ రిజిస్ర్టార్ విజయకృష్ణారెడ్డి
వెంకటాచలం(నెల్లూరు) : డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల వివరాలను విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) పరిధిలోని కళాశాలలు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఈనెల 7వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని వీఎస్‌యూ రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. కళాశాలలు, ఆయా కళాశాలలు ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు, కళాశాలలకు ఉన్నత విద్యా మండలి ఇచ్చిన అనుమతులు, యూనివర్సిటీ నుంచి పొందిన ఆఫిలియేషన్ వివరాల పత్రాల్ని ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇప్పటికే కళాశాలల వివరాల్ని నమోదు చేసిన వారు చివరి గడువులోగా సరిచేసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.