పెంచలకోనలో ‘నరకాసుర వధ’

ABN , First Publish Date - 2020-11-16T02:31:01+05:30 IST

దీపావళిని పురస్కరించుకుని శనివారం పెంచలకోనలో పెంచలనృసింహుడు కృష్ణావతారంలో ఆదిలక్ష్మి అమ్మవారు సత్యభామగా దర్శనమిచ్చారు.

పెంచలకోనలో ‘నరకాసుర వధ’
దహనమవుతున్న నరకాసురుడి బొమ్మ

ఫసత్యభామ, కృష్ణావతారంలో పెంచలస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారు

ఫఘనంగా దీపావళి వేడుకలు

రాపూరు, నవంబరు 15: దీపావళిని పురస్కరించుకుని శనివారం పెంచలకోనలో పెంచలనృసింహుడు కృష్ణావతారంలో ఆదిలక్ష్మి అమ్మవారు సత్యభామగా  దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని  నిర్వహించారు.  స్వాతి నక్షత్రం సందర్భంగా  చందనాలంకారసేవ,. శాంతిహోమం, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-16T02:31:01+05:30 IST