పాముకాటుతో గొర్రెల కాపరి మృతి
ABN , First Publish Date - 2020-11-14T02:55:19+05:30 IST
దుత్తలూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పాము కాటుకు గురై గొర్రెల కాపరి కాటిబోయిన ప్రసాద్ (38) మృతిచెందాడు. గురు
ఉదయగిరి, నవంబరు 13: దుత్తలూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పాము కాటుకు గురై గొర్రెల కాపరి కాటిబోయిన ప్రసాద్ (38) మృతిచెందాడు. గురువారం ప్రసాద్ గొర్రెలు తోలుకుని మేత కోసం సమీప పొలాల్లోకి వెళ్లాడు. ఆ సమయంలో పాము కాటుకు గురై స్పృహ తప్పి పడిపోగా అటుగా వెళుతున్న వారు గుర్తించి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.