గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-11-20T02:51:40+05:30 IST

స్వర్ణముఖి నదిలో గల్లంతైని విద్యార్థి ఇంగిలీల రాంబాబు మృతదేహం గురువారం లభ్యమైంది.

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
రాంబాబు మృతదేహం

వాకాడు, సెప్టెంబరు 19 : స్వర్ణముఖి నదిలో గల్లంతైని విద్యార్థి ఇంగిలీల రాంబాబు  మృతదేహం గురువారం లభ్యమైంది.  గల్లంతైన ప్రదేశానికి 20  మీటర్ల దూరంలో  మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై భోజ్యనాయక్‌ తెలిపారు. డీఎస్సీ రాజగోపాల్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గజ ఈతగాళ్ళకు, ఫారెస్ట్‌ అధికారులకు సూచనలు ఇచ్చారు. 24 గంటల అనంతరం ఈతగాళ్ళు గాలాలను ఉపయోగించి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకు వచ్చారు.  పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంధజేశారు. 

Updated Date - 2020-11-20T02:51:40+05:30 IST