అనుమానాస్పద స్థితిలో మృతదేహం
ABN , First Publish Date - 2020-02-08T07:05:11+05:30 IST
జాతీయ రహదారిపై ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలోని పంటకాలువ మనోహర్ తూము వద్ద గుర్తు తెలియని పాతికేళ్ల

కావలి(క్రైం),ఫిబ్రవరి7: జాతీయ రహదారిపై ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలోని పంటకాలువ మనోహర్ తూము వద్ద గుర్తు తెలియని పాతికేళ్ల యువకుడి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో శుక్రవారం స్థానికులు గుర్తించారు. ముసునూరు వీఆర్వో శింగరయ్య ఇచ్చిన సమాచారం మేరకు కావలి రూరల్ ఎస్సై మాల్యాద్రి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి నోట్లో నుంచి నాలుక బయటకు వచ్చి ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆఽధారాలు లభించలేదు. మృతడి శరీరంపై ఎరుపు, తెలుపు గడులు కలిగిన నలుపు నిండు చేతుల చొక్కా, నల్లని ప్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.