నేలటూరు తీరంలో మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-12-07T03:48:53+05:30 IST

మండలంలోని నేలటూరు సముద్ర తీరంలో ఆదివారం మృతదేహం లభ్యమైంది.

నేలటూరు తీరంలో మృతదేహం లభ్యం

ముత్తుకూరు, డిసెంబరు6: మండలంలోని నేలటూరు సముద్ర తీరంలో ఆదివారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు టీపీగూడూరు మండలం వెంకన్నపట్టపుపాళెంకు చెందిన కోడూరు వెంకయ్య(45) శనివారం చేపల వేటకు వెళ్లాడు. వేట చేసే సమయంలో  స్థానిక ఉప్పు కాలువలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతని  కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం వెంకయ్య మృతదేహం ముత్తుకూరు మండలం నేలటూరు సముద్ర తీరం సమీపంలోని కాలువలో తేలడంతో స్థానికులు కృష్ణపట్నం పోలీసులకు సమాచారం అందజేశారు. వెంకయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కృష్ణపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more