రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-11T04:40:55+05:30 IST

మండలంలోని ద్వారకాపురం రోడ్డు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తరుణ్‌, తరుణ్‌ (ఫైల్‌)

మరొకరికి తీవ్ర గాయాలు 

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 10 : మండలంలోని ద్వారకాపురం రోడ్డు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం మేరకు ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన మద్దెల తరుణ్‌(20) మేనకూరు సెజ్‌లో ఓ ప్రైవేట్‌ కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే బుధవారం రాత్రి  షిఫ్ట్‌కు హాజరయ్యేందుకు అత్తివరం నుంచి మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో ద్వారకాపురంరోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ ఢీ కొనడంతో మద్దెల తరుణ్‌ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఎదురుగా వచ్చి ఢీ కొట్టిన మోటారు సైకిలిస్టు చాన్‌బాషాకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చాన్‌బాషాను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-11T04:40:55+05:30 IST