భూ సమస్య పరిష్కరించాలని ధర్నా

ABN , First Publish Date - 2020-12-29T04:19:59+05:30 IST

మండలంలోని పెళ్లేరు గ్రామ పరిధిలో భూ సమస్యను పరిష్కరించాలంటూ అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

భూ సమస్య పరిష్కరించాలని ధర్నా
ధర్నా చేస్తున్న బాధితులు

చేజర్ల, డిసెంబరు 28: మండలంలోని పెళ్లేరు గ్రామ పరిధిలో భూ సమస్యను పరిష్కరించాలంటూ అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం  తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్‌ సభ్యులు  మాట్లాడుతూ దళితుల భూ  సమస్య ను మండల అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ధర్నా వద్దకు చేరుకున్న తహసీల్దారు శ్యామసుందరరాజ, సీఐ గంగాధర్‌  న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఎస్‌ఐ హనీఫ్‌, డీటీ కృష్ణ, ఆర్‌ఐ మస్తాన్‌ తహసీల్దారు వెంట ఉన్నారు. ధర్నాలో మిషన్‌ సభ్యులు ఓబులేసు, బాబు, ప్రసాద్‌, రాదాకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T04:19:59+05:30 IST