బస్సు ప్రయాణంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-22T04:43:28+05:30 IST

బెంగళూరులో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీ.లోకేష్‌ (24) శనివారం తెల్లవారుజామున కావలి మండలం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో బస్సులోనే మృతి చెందాడు.

బస్సు ప్రయాణంలో యువకుడి మృతి
బస్సులో మృతి చెందిన లోకేష్‌

కావలి రూరల్‌, నవంబరు 21: బెంగళూరులో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీ.లోకేష్‌ (24) శనివారం తెల్లవారుజామున కావలి మండలం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో బస్సులోనే మృతి చెందాడు. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రామ్‌నగర్‌కు చెందిన లోకేష్‌ బెంగళూరులో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను స్వగ్రాం వెళ్లేందుకు బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే రాజేష్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలోని కావలి మండలం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలోకి వచ్చేసరికి బస్సులోనే మృతి చెంది ఉండటాన్ని సహచర ప్రయాణికులు గుర్తించారు. ఈ విషయాన్ని బస్‌ సిబ్బంది  కావలి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలలో దించిన పోలీసులు మృతుడుకి ఆస్మా ఉండటంతో అనారోగ్యానికి గురై మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూరల్‌ ఎస్‌ఐ మల్యాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Read more