ఇస్లాంపేటలో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-04T03:49:07+05:30 IST
మండలంలోని ఇస్లాంపేట గ్రామంలో ఓ యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెంకటాచలం, డిసెంబరు 3 : మండలంలోని ఇస్లాంపేట గ్రామంలో ఓ యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇస్లాంపేటకు చెందిన షేక్ సద్దాం ఆలియాస్ సర్థార్ (29)కి 10 నెలల క్రితం నెల్లూరు రూరల్ మండలం నరుకూరుకు చెందిన ఆయేషాతో వివాహం జరిగింది. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం సర్థార్ తన ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడి తండ్రి మహబూబ్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.