డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై సీపీఎం ఆందోళన

ABN , First Publish Date - 2020-12-08T01:38:07+05:30 IST

నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో చిన్నారులు, స్థానికులు సోమవారం ఆందోళన చేపట్టారు.

డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై సీపీఎం ఆందోళన

నెల్లూరు(వైద్యం), డిసెంబరు 7 : నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో చిన్నారులు, స్థానికులు సోమవారం ఆందోళన చేపట్టారు. సీపీఎం నేత కాయం శ్రీనివాసులు మాట్లాడుతూ 15 రోజుల నుంచి వర్షాల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో సైడు కాలువల నిర్మాణానికి టెండర్లు ఖరారయినా ప్రస్తుత ప్రభుత్వంలో ఆ నిర్మాణాలు జరగలేదన్నారు. దీంతో మురికినీరు రోడ్లపైకి చేరి అనారోగ్యానికి కారణమవుతున్నాయన్నారు. వెంటనే డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.  

Updated Date - 2020-12-08T01:38:07+05:30 IST