వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం

ABN , First Publish Date - 2020-12-07T04:06:14+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం పట్టణ కార్యదర్శి పీ.పెంచలయ్య పేర్కొన్నారు. శివరామసుబ్బయ్య గిరిజన కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మి

వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం
వరద బాధితులకు బియ్యం పంపిణీ చేస్తున్న సీపీఎం నాయకులు

కావలి, డిసెంబరు 6: నివర్‌ తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం పట్టణ కార్యదర్శి పీ.పెంచలయ్య పేర్కొన్నారు. శివరామసుబ్బయ్య గిరిజన కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికుల సహాయంతో ఆదివారం బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కూలిపో యిన ఇళ్లకు రూ.25 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, పనులు లేని పేదలకు రూ. వెయ్యి, 50 కిలోల బియ్యం ఇవ్వాలని కోరారు. అలాగే గూడు లేని పేదలకు 2 సెంట్లు నివేశన స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. సీపీఎం నాయకులు టీ.మాలకొండయ్య, పీ.పెంచల నరసింహం, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బాబు, చేవూరి రసూల్‌, క్రాంతికుమార్‌, అనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.

 

Read more