కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలి

ABN , First Publish Date - 2020-11-16T05:19:28+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయంటూ సీపీఎం రాష్ట్ర కమిటీ నేత మిరియం వెంకటేశ్వర్లు విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలి
ప్రదర్శనలో సీపీఎం నేతలు

సీపీఎం రాష్ట్ర కమిటీ నేత మిరియం వెంకటేశ్వర్లు

నెల్లూరులో పాదయాత్రల ముగింపు


నెల్లూరు (వైద్యం), నవంబరు 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయంటూ సీపీఎం రాష్ట్ర కమిటీ నేత మిరియం వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో సీపీఎం చేపట్టిన పాదయాత్ర, ప్రదర్శ నలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఏసీ కూరగాయల మార్కెట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సదస్సులో వెంకటేశ్వర్లు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తుండగా వాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపడం సరికాదన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా కేంద్రంలోని బీజేపీకి సహకరించటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతోందని విమర్శించారు. మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణ సంస్కరణల పేరిట ఇంటిపన్ను, కొళాయి పన్ను, చెత్తపై పన్ను వేయాలని భావించటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం నేతలు అల్లాడి గోపాల్‌, అబ్దుల్‌ అజీజ్‌, కిన్నెర కుమార్‌, రఫీ, కొండా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-16T05:19:28+05:30 IST