167 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-12-30T05:09:26+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నెల్లూరు నగరంలో 167 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వెంకట రమణయ్య తెలిపారు.

167 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌
మాట్లాడుతున్న ఎంహెచ్‌వో వెంకటరమణయ్య

నగర పాలిక ఆరోగ్య అధికారి వెంకట రమణయ్య 


నెల్లూరు (సిటీ), డిసెంబరు 29 : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నెల్లూరు నగరంలో 167 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వెంకట రమణయ్య తెలిపారు. మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆరోగ్య శాఖ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి కేంద్రంలో ఒక వైద్యుడితోపాటు పోలీసు, సచివాలయ డిజిటల్‌ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్‌, ఆశా కార్యకర్త, స్థానిక వలంటీరుతో కూడిన బృందం అందుబాటులో ఉంటుందన్నారు. తొలుత వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులు, పోలీసులకు, ఆ తరువాత కరోనా బాధితులకు, ఆపై ప్రజలందరికీ టీకా వేస్తామన్నారు. ఈ మేరకు అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-30T05:09:26+05:30 IST