కరోనా కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2020-05-13T10:29:58+05:30 IST

సూళ్లూరుపేటలో కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ శేషగిరిబాబు చెప్పారు

కరోనా కట్టడికి చర్యలు

జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు 


సూళ్లూరుపేట, మే 12 : సూళ్లూరుపేటలో కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ శేషగిరిబాబు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్‌, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలసి సూళ్లూరుపేటలో పర్యటించారు. వనంతోపులో పరిస్థితిని  ఎమ్మెల్యే కిలివేటి వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ కోయంబేడుకు వెళ్లివచ్చిన వారిని గుర్తించి పరీక్షించగా, 15 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. అందుకే తాను ఎస్పీతో కలసి వచ్చానని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా  సహకరించి అందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్‌,  ఎస్పీ స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. 

Read more