కాంగ్రెస్‌, కమ్యూనిస్టులే రైతులను రెచ్చగొడుతున్నారు

ABN , First Publish Date - 2020-12-26T04:21:42+05:30 IST

పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నాయని ఇది మంచి సంప్రదాయం కాదని బీజేపీ జాతీయ యువమోర్చా అద్యక్షుడు హుసేన్‌ నాయక్‌ హితవు పలికారు.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టులే రైతులను రెచ్చగొడుతున్నారు
మాట్లాడుతున్న బీజేపీ ఎస్టీ జాతీయ యువమోర్చ అధ్యక్షుడు హుసేన్‌ నాయక్

 బీజేపీ ఎస్టీ జాతీయ యువమోర్చా అద్యక్షుడు హుసేన్‌ 

డక్కిలి, డిసెంబరు 25 : పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నాయని ఇది మంచి సంప్రదాయం కాదని బీజేపీ జాతీయ యువమోర్చా అద్యక్షుడు హుసేన్‌ నాయక్‌ హితవు పలికారు. శుక్రవారం డక్కిలి మండలం మాధవాయపాళెంలో ఏర్పాటు చేసిన రైతు చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రైతుల ప్రయోజనం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టడం ఓర్వలేని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు రైతులను రెచ్చగొట్టే పనిలో పడ్డారని విమర్శించారు. ఇందుకు గాను కమ్యూనిస్టు పార్టీలోని కొందరు కీలక నేతలకు చైనా నుంచి నిదులు అందుతున్నాయని ఆరోపించారు.  అంతకు ముందు వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఇక తిరుపతిలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌ ఆర్‌ నాయుడు,  సీనియర్‌ నాయకులు అల్లం చంద్రమోహన్‌, యోగేశ్వరరావు, బాలకృష్ణ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.ారు.

Updated Date - 2020-12-26T04:21:42+05:30 IST