కాంగ్రెస్‌ పూర్వ వైభవానికి సమష్టిగా కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-12-29T05:02:07+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా పార్టీ శ్రేణులు సమష్టి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పూర్వ వైభవానికి సమష్టిగా కృషి చేయాలి
పార్టీ జెండాను ఎగురవేస్తున్న దేవకుమార్‌ రెడ్డి

 పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో జిల్లా అధ్యక్షుడు చేవూరు


నెల్లూరు (వైద్యం), డిసెంబరు 28 : కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా పార్టీ శ్రేణులు సమష్టి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో నిర్వహించారు. కాంగ్రెస్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ నేతృత్వంలో వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్‌ కట్‌చేసి అందరికీ పంచి పెట్టారు. పార్టీ ఆశయాల కోసం పనిచేస్తామని నేతలు, కార్యకర్తలు ప్రమాణం చేశారు. చేవూరు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల దీక్షకు పరిష్కారం చూపకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్‌, నగర అధ్యక్షుడు ఉడతా వెంకట్రావ్‌, నాయకులు భవానీ నాగేంద్రప్రసాద్‌, షేక్‌ ఫయాజ్‌, చింతాల వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:02:07+05:30 IST