భూ బాగోతం విచారణపై గోప్యం ?

ABN , First Publish Date - 2020-02-08T06:49:17+05:30 IST

చిట్టమూరు మండల అధికారులు భూబాగోతానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణను గోప్యంగా

భూ బాగోతం విచారణపై గోప్యం ?

అడిగిన విలేకర్లపై గూడూరు సబ్‌ కలెక్టర్‌ రుసరుసలు

చిట్టమూరు, ఫిబ్రవరి 7 : చిట్టమూరు మండల అధికారులు భూబాగోతానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.  కలెక్టర్‌ ఆదేశాల మేరకు గూడూరు సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ విచారణాధికారిగా శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. ఆ సమచారంతో విలేకర్లు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. విలేకర్లు అందరూ వచ్చేశారా! ఎవరైనా ఉంటే పిలవండి అంటూ సబ్‌ కలెక్టర్‌  వేచి చూశారు. అనంతరం భూ బాగోతంపై ఏదో చెబుతారని ఇద్దరు మీడియా ప్రతినిధులు చానెళ్ల లోగోలను ఆయన ముందర పెట్టారు. ఇవెందుకు తీసేయండంటూ అన్నారు. ఆ తరువాత విలేకర్లు ఫొటోలు తీసుకున్న తరువాత తీసుకున్నారా... అయితే వెళ్లండంటూ సబ్‌ కలెక్టర్‌ రుసరుసలాడుతూ ఒక్క మాటతో బయటకు పంపించేశారు. దీనిని బట్టి భూ బాగోతంపై విచారణ గోప్యంగా చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-02-08T06:49:17+05:30 IST