ముదిరాజ్‌ మహాసభ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-14T04:44:40+05:30 IST

ముదిరాజ్‌ మహాసభ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోరుబోయిన వెంకటేశ్వర్లు మృతి ముదిరాజ్‌లకు తీరని లోటని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనకట్ల రఘురామ్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు.

ముదిరాజ్‌ మహాసభ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన నివాళి
వెంకటేశ్వర్లు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మహాసభ నాయకులు

నెల్లూరు (వీఆర్సీ), డిసెంబరు 13 : ముదిరాజ్‌ మహాసభ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోరుబోయిన వెంకటేశ్వర్లు మృతి ముదిరాజ్‌లకు తీరని లోటని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనకట్ల రఘురామ్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో వెంకటేశ్వర్లు మృతికి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రఘురామ్‌ మాట్లాడుతూ గుంటూరు హోంశాఖలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన వెంకటేశ్వర్లు ముదిరాజ్‌ మహాసభకు ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ముదిరాజ్‌ మహాసభ కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ ఉద్యోగ విభాగం జిల్లా  అధ్యక్షుడు గంపల చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ శ్రీనివాసులు, మహాసభ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, జిల్లా యువత అధ్యక్షుడు పీ శ్రీనివాసులు, మునికృష్ణ, చెంచుకృష్ణయ్య, శ్రీనివాస్‌, మహేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:44:40+05:30 IST