శంభన్ సొసైటీ భూముల ఆక్రమణదారులపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-12-08T04:31:20+05:30 IST
శంభన్ సొసైటీ భూముల ఆక్రమణదారులు భయాందోళనలకు గుర్తి చేస్తున్నారని మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ శంభునిపాళెం గ్రామస్థులు సోమవారం ఎస్‌ఐ చిన్నబలరామయ్యకు ఫిర్యాదు చేశారు.

అల్లూరు, డిసెంబరు 7 : శంభన్ సొసైటీ భూముల ఆక్రమణదారులు భయాందోళనలకు గుర్తి చేస్తున్నారని మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ శంభునిపాళెం గ్రామస్థులు సోమవారం ఎస్‌ఐ చిన్నబలరామయ్యకు ఫిర్యాదు చేశారు. శంభన్ సొసైటీ పేరిట పూర్వం మంజూరైన భూములపై తామంతా హక్కు కలిగి ఉన్నామని తెలిపారు. శంభన్ సొసైటీ పేరున ఉన్న దాదాపు 35 ఎకరాల ఉప్పు భూములను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఆరుగురు మాత్రమే అనుభవిస్తున్నారనీ, దీనిపై ప్రశ్నించిన వారిని వారు భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న సుమారు 100 మంది వివరించారు. దీంతో ఎస్‌ఐ ఉభయులతో మాట్లాడి తహసీల్దారుకు సమాచారం అందిస్తామని, ఆయన ఆధ్వర్యంలో చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.