రైతులకు సాయం చేయండి

ABN , First Publish Date - 2020-12-29T05:05:32+05:30 IST

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని కోరుతూ జనసేన నాయకులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు.

రైతులకు సాయం చేయండి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న జనసేన నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట జనసేన ధర్నా


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 28 : నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని కోరుతూ జనసేన నాయకులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. పార్టీ పీఏసీ సభ్యుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌ మాట్లాడుతూ తుఫాన్‌ కారణంగా  నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.34వేలు పరిహారం, రూ.10వేలు తక్షణ సాయం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూసుంపూడి శ్రీనివాసులు, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కిషోర్‌ గనుకుల, సుజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-29T05:05:32+05:30 IST