పీఏసీఎస్‌లపై సమగ్ర ప్రణాళిక ఇవ్వండి

ABN , First Publish Date - 2020-07-06T10:40:06+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఏర్పాటు, అందుకు చేయాల్సిన పనులపై సమగ్ర ప్రణాళికను రూపొందించి..

పీఏసీఎస్‌లపై సమగ్ర ప్రణాళిక ఇవ్వండి

ప్రయోగాత్మకంగా క్లస్టర్‌ వ్యవసాయం

కలెక్టర్‌ శేషగిరిబాబు


నెల్లూరు(వ్యవసాయం), జూలై 5 : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఏర్పాటు, అందుకు చేయాల్సిన పనులపై సమగ్ర ప్రణాళికను రూపొందించి ఈనెల 9వతేదీ లోగా అందించాలని వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యానశాఖల అధికారులను కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయాశాఖలపై ఆయన సమీక్షించారు. ఒకటిగానీ, రెండు మూడు మండలాలతోగానీ క్లస్టర్‌ని ఏర్పాటు చేసుకుని అక్కడి రైతులతో చర్చించి మార్కెట్‌కు అనువుగా ఉన్న పంటలను పండించేలా, అక్కడి నుంచి మార్కెటింగ్‌ చేసేలా సంబంధిత మార్కెటింగ్‌ ఏజెన్సీలతో చర్చించాలని సూచించారు. అంతేకాకుండా ప్యాకింగ్‌కి సంబంధించిన యంత్రాలు, సామగ్రిని  అందుబాటులో ఉంచాలని, తగిన సిబ్బందిని నియమించి ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. పంటలు సాగు చేసే వారు, పాడి రైతులను ప్రోత్సహించే విధంగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ భావన, పశుసంవర్థకశాఖ జేడీ విజయమోహన్‌, ఉద్యానశాఖ ఏడీ ప్రదీప్‌కుమార్‌, వ్యవసాయశాఖ డీడీ ప్రసాద్‌, ఏడీ అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:40:06+05:30 IST