మాస్కులు అందజేయండి..
ABN , First Publish Date - 2020-07-18T11:19:56+05:30 IST
జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్‌బాబు వెల్లడించారు.

నిర్ధారణ పరీక్షలు చేయండి!
అధికారుల సమీక్షలో కలెక్టర్
నెల్లూరు(వైద్యం) : జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్‌బాబు వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జడ్పీ ఎమర్జెన్సీ సెంటర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, వలంటీర్లు ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి తిరిగి మాస్క్‌లు అందచేయాలని, వీలయినంత ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అధికారులు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ వలంటీర్లను అప్రమత్తం చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది రొటేషన్ పద్ధతిలో విధులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో అభివృద్ధి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జీజీహెచ్, నారాయణ ఆసుపత్రులలో ఆక్సిజన్, ఐసోలేషన్ పడకలు ఇతర సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున వచ్చే మూడు నెలలు కీలకమని అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సాంబశివరావ్, డీసీహెచ్‌ఎ్‌స చెన్నయ్య, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌వో స్వర్ణలత, ప్రోగ్రాం అఽధికారి ఉమామహేశ్వరి, డాక్టర్ రమాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.