రాజ్యాంగ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉండాలి

ABN , First Publish Date - 2020-11-27T05:43:00+05:30 IST

ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు.

రాజ్యాంగ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉండాలి
సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 26 : ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో సిబ్బందితో కలెక్టర్‌ రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రాఽథమిక హక్కులు, విధులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి ఎన్నో వరాలను రాజ్యాంగం మనకు ప్రసాదించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రజల నుంచి వచ్చే అర్జీలపై సత్వరం నిర్ణయాలు తీసుకుంటూ పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖలకు మార్గదర్శకంగా ఉంటూ గతేడాదికంటే మెరుగ్గా ప్రజలకు సేవలందించేందుకు కృషి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎంవీ రమణ, కలెక్టరేట్‌ ఏవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T05:43:00+05:30 IST