సీజేఎఫ్‌ఎస్‌ భూములపై విచారణ చేయండి

ABN , First Publish Date - 2020-12-20T02:33:39+05:30 IST

మండలంలోని అక్కంపేటలో సీజేఎఫ్‌ఎస్‌ భూములను, పట్టాభూములుగా మార్చుకున్నారని, ఈ విషయమై

సీజేఎఫ్‌ఎస్‌ భూములపై విచారణ చేయండి
తహసీల్దార్‌తో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

 మనుబోలు, డిసెంబరు 19: మండలంలోని అక్కంపేటలో సీజేఎఫ్‌ఎస్‌ భూములను, పట్టాభూములుగా మార్చుకున్నారని, ఈ విషయమై విచారణ చేసి నిగ్గు తేల్చాలంటూ బీజేపీ నాయకులు శనివారం తహసీల్దార్‌ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెం.103లోని 3ఎకరాల74 సెంట్ల భూమి ఉందన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం దళితులకు భూ పంపిణీ చేసిందన్నారు.  దానిని గ్రామానికి చెందిన ఓ రాజకీయనాయకుడు తనపేరుతో పట్టాభూమిగా మార్చుకున్నాడన్నారు.  ఇప్పుడు అదే భూమిని ఇళ్లస్థలాలకు ఇచ్చేందుకు సిద్దం చేస్తున్నారన్నారు. సీజేఎఫ్‌ఎస్‌ భూములు ఎలా పట్టాభూములగా మారాయో త్వరగా విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు డాక్టర్‌ మారం విజయలక్ష్మి, పంది మస్తానయ్య గౌడ్‌, మండల ఇన్‌చార్జి ఎస్‌కే. షఫీ, మండలాధ్యక్షుడు ఓడూరు శ్రీనువాసులు రెడ్డి, జిల్లా నాయకులు బోలాశ్రీనువాసులు, చల్లా లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.


Read more